ఆకట్టుకునే కామెడీతో ‘తులసీవనం’ ట్రైలర్‌

అనిల్‌ రెడ్డి డైరెక్షన్‌లో క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో రూపొందిన చిత్రం ‘తులసివనం’. వెంకటేష్‌ కాకమాను, విష్ణు మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈటీవి విన్‌ ఓటీటీ కోసం చేసిన ఈ మూవీ పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది ‘తులసీవనం’ . ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్.
అక్షయ్, ఐశ్వర్య, విష్ణు తమ కామిక్ టైమింగ్ తో కడుపుబ్బానవ్వించారు. దర్శకుడు అనిల్ రెడ్డి న్యూ ఏజ్ కంటెంట్ ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

అనిల్, తులసి పెళ్లి చూపులు నుంచి నాకు సహాయ దర్శకులుగా వున్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం(నవ్వుతూ). తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్ పిక్చరే. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్ దృష్ట్యా కొన్ని భయాలు వుంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వెనుక అందరి కృషి వుంది. క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. తులసీవనంలో ఆ క్లారిటీ వుంటుందన్నారు తరుణ్‌ భాస్కర్.
ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేసారు నటీనటులు, చిత్ర యూనిట్.

Related Posts