25 కోట్ల అప్పుపై సమంత రియాక్షన్

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం తను అరుదైన మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. ఆ వ్యాధి నుంచి కొంత కోలుకుని అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసింది.వరుసగా ఆఫర్స్ ఉన్నా ముందు తన హెల్త్ ను బాగు చేసుకోవాలనే ఒక యేడాది పాటు ఇండస్ట్రీ నుంచి లాంగ్ లీవ్ తీసుకుంది.

తను నటించిన ఖుషీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. బాలీవుడ్ లో సిటాడెల్ అనే సిరీస్ విడుదలకు ఉంది. ప్రస్తుతం బాలి దేశంలో విహారయాత్రలో ఉంటూనే సహజ చికిత్సలు తీసుకుంటోంది. ఈ తరుణంలో సమంతపై ఓ హాట్ రూమర్ వ్యాపించింది. అదేంటంటే.. మయోసైటిస్ చికిత్స కోసం తను ఓ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పుగా తీసుకుంది అనేదే ఆ రూమర్. నిజానికి ఇది వినగానే చాలామంది నిజమా అనుకున్నారు. ఏమాత్రం తెలివి ఉన్నవారికైనా అబద్ధం అని అర్థం అవుతుంది. బట్ తను వ్యాధి పరంగా ఏ స్టేజ్ లోఉందనేది తెలియని వారు మాత్రం నిజమేనేమో అనుకున్నారు. ఇక ఈ వార్త వేరే దేశంలో ఉన్న సమంత వరకూ వెళ్లింది. దీంతో తను వెంటనే రియాక్ట్ అయింది.

“మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా.. మీకెవరో చండాలమైన డీల్ గురించి చెప్పారు. నా సమస్య గురించి నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను. అది కూడా చాలా చిన్న అమౌంట్. నాకెవరో ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. నా కెరీర్ లో నేనూ సంపాదించుకున్నాను.కాబట్టి నా గురించి నేను జాగ్రత్తలు తీసుకోగలను.. థ్యాంక్యూ” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

సమంత గురించి వచ్చిన వార్త కంటే ఇదే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతోంది. తనేదో సమస్యలో ఉంటే ఇలాంటి పనికిమాలిన రూమర్స్ ఎందుకు వ్యాపింప చేస్తున్నారా అని సదరు మీడియా హౌస్ పైనా నెటిజన్స్ మండిపడుతున్నారు. మొత్తంగా శామ్.. హ్యాపీస్ అన్నమాట.

Related Posts