టాలీవుడ్

Samantha : హాలీవుడ్ కోసం ఆడిషన్స్ ఇస్తోన్న సమంత

సమంత ఆడిషన్స్ ఇవ్వడం ఏంటీ అనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం. నటిగా ఎన్నో సినిమాలు చేసి.. గొప్పగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఆడిషన్స్ అనే మాట వినిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. పైగా స్టార్డమ్ పరంగా దేశవ్యాప్తంగా గుర్తింపూ తెచ్చుకుందీ బ్యూటీ. అయినా ఇదేంటీ అనిపిస్తే అర్జెంట్ గా టర్కీ వెళ్లాలి. ప్రస్తుతం ఖుషీ మూవీ పాటల చిత్రీకరణ కోసం టర్కీ వెళ్లి ఉంది సమంత.

అక్కడ ఖుషీకి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. మొత్తం క్రూ అంతా ఇండియాకు వచ్చేసింది. బట్ తను మాత్రం అక్కడే ఉండిపోయింది. దీంతో చాలామంది తను టర్కీలో ఎందుకు ఉంది..? అక్కడేం చేస్తుందీ అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అసలే అమ్మడు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఒంటరిగానూ ఉంటోంది కాబట్టి ఈ డౌట్స్ లో న్యాయం ఉందీ అనుకోవచ్చు. కానీ ఈ డౌట్స్ ఏవీ నిజం కాదు. ఎందుకంటే అమ్మడు టర్కీలోనే ఉండి కొన్ని సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ ఇస్తోంది.


యస్.. మన దగ్గర అంటే యాక్టింగ్ రాకపోయినా పాస్ ఆఫర్స్ వస్తాయి. కానీ హాలీవుడ్ లో అలా కాదు. ఎంత పెద్దస్టార్ అయినా ఓ కొత్త సినిమా ఒప్పుకుంటే ఆ పాత్రకు తగ్గట్టుగా ఏదో ఒక వీడియో చేసి పంపించాలి. అది నచ్చితేనే తీసుకుంటారు. అంటే ప్రతి సినిమాకూ ఆడిషన్ ఉంటుందన్నమాట.

ప్రస్తుతం సమంత కూడా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడి నుంచి హాలీవుడ్ ప్రయత్నాలు చేస్తూ ఆల్రెడీ రెండు ప్రాజెక్ట్స్ కు సైన్‌ చేసింది. వీటిలో ఒకటి చెన్నై బేస్డ్ గా సాగే సినిమా కావడం విశేషం. అయితే అమ్మడి టాలెంట్ తెలిసిన కొన్ని హాలీవుడ్ కంపెనీస్ .. తమ సినిమాల కోసం అప్రోచ్ అవుతున్నాయట.అందుకే టర్కీలోనే ఉండి వారితో మాట్లాడుతూ.. అడిగిన వీడియాలు యాక్టింగ్ చేసి పంపిస్తోందట. అంటే ఆడిషన్స్ అన్నమాట. సో.. తను హాలీవుడ్ ను చాలా సీరియస్ గా తీసుకుందనే అనుకోవాలి. మరి ఈ ఆడిషన్స్ ద్వారా ఇంకెన్ని ప్రాజెక్ట్స్ వస్తాయో కానీ.. సమంత సీరియస్ నెస్ కు చాలామంది సర్ ప్రైజ్ అవుతున్నారు.

Telugu 70mm

Recent Posts

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

7 mins ago

Manchu Manoj Enters The World Of ‘Mirai’

Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…

10 mins ago

NTR Birthday Specials Are Getting Ready..!

Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…

18 mins ago

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

14 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

15 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

15 hours ago