Samantha : హాలీవుడ్ కోసం ఆడిషన్స్ ఇస్తోన్న సమంత

సమంత ఆడిషన్స్ ఇవ్వడం ఏంటీ అనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం. నటిగా ఎన్నో సినిమాలు చేసి.. గొప్పగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఆడిషన్స్ అనే మాట వినిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. పైగా స్టార్డమ్ పరంగా దేశవ్యాప్తంగా గుర్తింపూ తెచ్చుకుందీ బ్యూటీ. అయినా ఇదేంటీ అనిపిస్తే అర్జెంట్ గా టర్కీ వెళ్లాలి. ప్రస్తుతం ఖుషీ మూవీ పాటల చిత్రీకరణ కోసం టర్కీ వెళ్లి ఉంది సమంత.

అక్కడ ఖుషీకి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. మొత్తం క్రూ అంతా ఇండియాకు వచ్చేసింది. బట్ తను మాత్రం అక్కడే ఉండిపోయింది. దీంతో చాలామంది తను టర్కీలో ఎందుకు ఉంది..? అక్కడేం చేస్తుందీ అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. అసలే అమ్మడు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఒంటరిగానూ ఉంటోంది కాబట్టి ఈ డౌట్స్ లో న్యాయం ఉందీ అనుకోవచ్చు. కానీ ఈ డౌట్స్ ఏవీ నిజం కాదు. ఎందుకంటే అమ్మడు టర్కీలోనే ఉండి కొన్ని సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ ఇస్తోంది.


యస్.. మన దగ్గర అంటే యాక్టింగ్ రాకపోయినా పాస్ ఆఫర్స్ వస్తాయి. కానీ హాలీవుడ్ లో అలా కాదు. ఎంత పెద్దస్టార్ అయినా ఓ కొత్త సినిమా ఒప్పుకుంటే ఆ పాత్రకు తగ్గట్టుగా ఏదో ఒక వీడియో చేసి పంపించాలి. అది నచ్చితేనే తీసుకుంట�