టాలీవుడ్

సమంత క్లారిటీ ఇవ్వలేదు.. తమన్ ఫిక్స్

ఇప్పటి వరకూ సెలబ్రిటీ కాస్టూమ్ డిజైనర్, స్టైలిష్ట్ గా మెప్పించిన నీరజా కోన దర్శకురాలుగా మారుతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. నీరజ కోన అంటే ఫేమస్ రైటర్ కోన వెంకట్ సిస్టరే. సో.. ఆ వాసనలతోనే తనూ దర్శకురాలుగా మారబోతోంది అనుకోవచ్చు. పైగా యేళ్ల తరబడి ఇండస్ట్రీలోనే అన్నీ చూస్తోంది.. తెలుసుకుంటోంది. సో తను డైరెక్టర్ కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు.

అయితే తన ఫస్ట్ మూవీకి సర్ ప్రైజింగ్ కాంబినేషన్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది నీరజ. ఆల్రెడీ జొన్నలగడ్డ సిద్ధు హీరోగా ఫిక్స్ అయ్యాడు. అతనితో పాటు సమంతను తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకూ సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బట్ తను ఈ సినిమా చేస్తోందనే వార్తలు మాత్రం వచ్చాయి.

సమంతకు, నీరజా కోనకు మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే తన డెబ్యూ మూవీలో నటించమని అడిగినట్టుంది. బట్ సమంత ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ప్రాజెక్ట్ లో నటించే విషయంలో ఇప్పటి వరకూ సమంత నుంచి సరైన క్లారిటీ లేదు కానీ సంగీతం మాత్రం తమన్ అందించబోతున్నాడు.

ఈ మేరకు ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తోంది. సమంతక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో నందిని రెడ్డి తర్వాత నీరజా కోన గురించే చెబుతారు. నందిని కోసం అప్పట్లో జబర్దస్త్, కొన్నాళ్ల క్రితం ఓ బేబీ సినిమాలు చేసింది సమంత. మరి నీరజ విషయంలో ఎందుకు ఆలోచిస్తోంది అనే డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి.


అయితే సమంత కొన్నాళ్లుగా టాలీవుడ్ ను వదిలేసే ప్రయత్నాలు చేస్తోంది అని బలంగా వినిపిస్తోంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదు అనేవాళ్లూ ఉన్నారు. అదీ నిజమే. తను ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.

అలాగే ఓ హాలీవుడ్ మూవీ కూడా కన్ఫార్మ్ అయింది. ఈ టైమ్ లో మళ్లీ ఓ చిన్న సినిమా చేస్తే తన రేంజ్ తగ్గుతుంది అనుకుంటుందో లేక ఇంకేదైనా రీజన్ ఉందో కానీ.. ఇప్పటికైతే నీరజా కోన దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి తమన్ సంగీతం అందించబోతున్నాడు అనేది ఫైనల్.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

29 mins ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

49 mins ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

1 hour ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

1 hour ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

7 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

7 hours ago