సమంత క్లారిటీ ఇవ్వలేదు.. తమన్ ఫిక్స్

ఇప్పటి వరకూ సెలబ్రిటీ కాస్టూమ్ డిజైనర్, స్టైలిష్ట్ గా మెప్పించిన నీరజా కోన దర్శకురాలుగా మారుతోందని గతంలోనే వార్తలు వచ్చాయి. నీరజ కోన అంటే ఫేమస్ రైటర్ కోన వెంకట్ సిస్టరే. సో.. ఆ వాసనలతోనే తనూ దర్శకురాలుగా మారబోతోంది అనుకోవచ్చు. పైగా యేళ్ల తరబడి ఇండస్ట్రీలోనే అన్నీ చూస్తోంది.. తెలుసుకుంటోంది. సో తను డైరెక్టర్ కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు.

అయితే తన ఫస్ట్ మూవీకి సర్ ప్రైజింగ్ కాంబినేషన్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది నీరజ. ఆల్రెడీ జొన్నలగడ్డ సిద్ధు హీరోగా ఫిక్స్ అయ్యాడు. అతనితో పాటు సమంతను తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటి వరకూ సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. బట్ తను ఈ సినిమా చేస్తోందనే వార్తలు మాత్రం వచ్చాయి.

సమంతకు, నీరజా కోనకు మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే తన డెబ్యూ మూవీలో నటించమని అడిగినట్టుంది. బట్ సమంత ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ప్రాజెక్ట్ లో నటించే విషయంలో ఇప్పటి వరకూ సమంత నుంచి సరైన క్లారిటీ లేదు కానీ సంగీతం మాత్రం తమన్ అందించబోతున్నాడు.

ఈ మేరకు ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తోంది. సమంతక తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో నందిని రెడ్డి తర్వాత నీరజా కోన గురించే చెబుతారు. నందిని కోసం అప్పట్లో జబర్దస్త్, కొన్నాళ్ల క్రితం ఓ బేబీ సినిమాలు చేసింది సమంత. మరి నీరజ విషయంలో ఎందుకు ఆలోచిస్తోంది అనే డౌట్స్ అందరిలోనూ ఉన్నాయి.


అయితే సమంత కొన్నాళ్లుగా టాలీవుడ్ ను వదిలేసే ప్రయత్నాలు చేస్తోంది అని బలంగా వినిపిస్తోంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదు అనే