సలార్ వచ్చే యేడాదికి వెళ్లదట

ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో ఒకటి సలార్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. కానీ సిజి వర్క్ కొన్ని సీన్స్ లో సరిగా లేదని పోస్ట్ పోన్ చేసింది మూవీ టీమ్. మరోవైపు కన్నడ, తమిళ్ భాషల్లో డబ్బింగ్ కూడా పెండింగ్ ఉందనే టాక్ ఉంది. సరే పెద్ద సినిమాలకు సంబంధించి ఇలాంటి జాగ్రత్తలు కాస్త ముందుగానే తీసుకుంటే తర్వాత వచ్చేవిమర్శలను తప్పించుకోవచ్చు. అంత వరకూ ఓకే. కానీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు..? ఈ ప్రశ్న అయితే మిగిలి ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మేకర్స్ పై ఉంది. బట్ వాళ్లు ఎప్పట్లానే కామ్ గా ఉన్నారు.


నిజానికి ఈ మూవీ ఓవర్శీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసింది. భారీగా టికెట్స్ అమ్ముడు పోయి ఉన్నాయి. ఇటు ఇండియాలో కూడా బిజినెస్ పూర్తి కాకున్నా భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో నిర్మాతలపై ఒత్తిడి ఉంటుంది. అందుకే పబ్లిక్ గా అనౌన్స్ చేయడం లేదు కానీ.. ఈ చిత్రాన్ని నవంబర్ లో ఖచ్చితంగా విడుదల చేస్తాం అని డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రామిస్ చేస్తున్నారట. అక్కడికీ ఏదైనా సమస్య ఉంటే డిసెంబర్ లో అయినా వస్తాం కానీ.. 2024 అనే మాటే లేదు అని ఖచ్చితంగా హామీ ఇస్తున్నారట. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కొంత కూల్ అవుతున్నా.. ఆ డేట్ అఫీషియల్ గా ప్రకటిస్తే బావుంటుందనే కోణంలోనూ ఒత్తిడి చేస్తున్నారట. మరి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.


ఇక ప్రభాస్ తో పాటు శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ చేస్తోంది. కానీ తను రెగ్యులర్ హీరోయిన్ లా ఉండదట. విలన్ గా మళయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ నటించాడు. ప్రభాస్, పృథ్వీ మధ్య వచ్చే ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందంటున్నారు. అతన్ని విలన్ అని చెబుతున్నా.. వీళ్లు ముందు ఫ్రెండ్స్ గా ఉండి తర్వాత విడిపోతారట. ఆ క్రమంలోనే పృథ్వీ పాత్ర ప్రభాస్ కు ఎదురుతిరగడంతో తన స్నేహితుడిని చంపడం ఇష్టం లేకున్నా.. ఆ నిర్ణయం తీసుకుంటాడట ప్రభాస్. మొత్తంగా సలార్ ఈ యేడాదే విడలవుతుంది. కానీ ఎప్పుడనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పరు. అదీ మేటర్.

Related Posts