పుంజుకున్న శెట్టి అండ్ శెట్టి

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఇంకా చెబితే సినిమా నిలబడటం కష్టం అన్నవాళ్లూ లేకపోలేదు. అటు జవాన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఇంక శెట్టి అండ్ శెట్టి షెడ్డుకే అనుకున్నారు. బట్ అనూహ్యంగా ఈ చిత్రం పుంజుకుంది. మొదటి రోజు చాలా డల్ గా ఉన్న ఈ సినిమా రెండో రోజుకు చాలా బెటర్ అయింది. ఇక మూడో రోజైన శనివారానికి కలెక్షన్స్ పెరిగాయి. కొన్ని థియేటర్స్ లో జవాన్ కంటే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంటోంది.


మిస్ శెట్టి మిస్టర్ శెట్టికి రివ్యూస్ అస్సలు బాలేదు. కేవలం నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ వరకు మాత్రమే బావుందన్నారు. అనుష్క పాత్ర, సెకండ్ హాఫ్‌ మరీ స్లోగా ఉందన్న కంప్లైట్స్ తో రేటింగ్స్ కూడా తక్కువే ఇచ్చారు. ఇక్కడే మూవీ పిఆర్ టీమ్ తెలివిగా వ్యవహరించింది. ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రిటీస్ అందరికీ సినిమా చూపించారు. అందరిచేతా శభాష్ అనిపించారు. ముఖ్యంగా రాజమౌళి చేసిన ట్వీట్ సినిమాకు చాలా ప్లస్ అయిందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అబ్బో సినిమా సూపర్ అంటూ జాకీలు పెట్టి మరీ లేపారు. సినిమా లేసింది. కలెక్షన్స్ పెరిగాయి.

మరి ఆదివారం తర్వాత అసలు రంగు బయట పడుతుంది. కానీ ఈ లోగానే బ్రేక్ ఈవెన్ అవుతుందంటున్నారు. మొత్తంగా మొదటి రోజు టాక్ ను సెలబ్రిటీస్ పొగడ్తలతో దాటుకుని విజయం వైపు పరుగులు పెడుతోంది మిస్ శెట్టి మిస్టర్ శెట్టి.

Related Posts