రెండో రోజూ అదరగొట్టిన జవాన్

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ కు దేశవ్యాప్తంగా తిరుగులేని టాక్ వచ్చింది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోన్న ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో బాలీవుడ్ నుంచి ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది. మొదటి రోజు 129 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు వర్కింగ్ డే అయినా.. కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. రెండో రోజు కూడా 111 కోట్లు కలెక్షన్స్ సాధించింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 240 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయన్నమాట. ఈ యేడాది పఠాన్ తో బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచిన షారుఖ్ ఖాన్ ఈ మూవీతో ఆ రికార్డులు బ్రేక్ చేయబోతున్నాడు అని విశ్లేషకులు ముందు నుంచీ చెబుతున్నారు. ఇక శనివారం, ఆదివారం కలెక్షన్స్ చూస్తే ఖచ్చితంగా ఈ ఫిగర్ కంటే ఎక్కువగా నమోదవుతాయని ఈజీగా చెప్పొచ్చు. ఈ రెండు రోజులకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడని అర్థం అవుతుంది.


షారుఖ్ సరసన నయనతార నటించిన ఈ మూవీలో అనేక సామాజిక సమస్యలను గురించి అద్భుతంగా డీల్ చేశాడు అట్లీ. రైతులు, బ్యాంకింగ్ సిస్టమ్, మన వైద్య విధానం, ఆర్మీ వారి ఆయుధాలు, ఓటు విలువ అంటూ ఇన్ని సమస్యలను ఒకే సినిమాలో చాలా గొప్పగా కనెక్ట్ చేస్తూ చూపించగలిగాడు. ముఖ్యంగా రైతుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది. ఆ పాత్రలో నటించిన వారు జీవించారు. వైద్య వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆ పరిస్థితులు చూపిస్తున్నాం. వాటిన మార్చడం ఏమంత కష్టం కాదు. కానీ మార్చు. కారణమేంటో అందరికీ తెలుసు.


షారుఖ్ కు తోడు నయనతార పాత్ర బలంగా ఉంది. విలన్ గా విజయ్ సేతుపతి తన నటనతో అదరగొట్టడం. దీపికా పదుకోణ్ పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ కావడం, షారుఖ్ టీమ్ లో ఉన్న గాళ్స్ పాత్రలూ బలంగా ఉండటం.. ఇలా ఎలా చూసినా అట్లీ బలమైన(సౌత్ లో �