టాలీవుడ్

అభిమానులను నిరాశపరిచిన సలార్ టీజర్

సలార్ టీజర్ వస్తుందనగానే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. బాహుబలి తర్వాత ఇది మా ప్రభా సినిమా అని వాళ్లు గట్టిగా చెప్పుకునే ఛాన్స్ ఇవ్వలేదు డార్లింగ్. సాహోలో యాక్షన్ డోస్ అదిరిపోయినా కంటెంట్ తేలిపోయింది. రాధేశ్యామ్ ఇంక సరేసరి. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్‌ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అయినా ఇవన్నీ వద్దు మాకు సలార్ ఉంది అన్న ఆనందంలో ఉన్నారు అభిమానులు. అందుకే ఇప్పటి వరకూ సినిమా హిస్టరీలో ఎవరూ రిలీజ్ చేయనంతగా ఒక టీజర్ ను తెల్లవారు జామునే 5:12 నిమిషాలకు విడుదల చేస్తే కళ్లు కాయలు చేసుకుని మరీ ఎదురు చూశారు. టీజర్ టైమ్ కే వచ్చింది. బట్ ఫ్యాన్స్ టైమింగ్ అంత బాగాలేనట్టు ఉంది

.
ఈ టీజర్ లో ప్రశాంత్ నీల్ తరహాలోనే ఎలివేషన్స్ తప్ప ఏమీ కనిపించలేదు. కనీసం ప్రభాస్ ను కూడా సరిగా చూపించలేదు. ఆయన వీపు, చేతులు తప్ప టీజర్ లో ఇంకేం లేదు. చివర్లో మాత్రమే ఫేస్ ను చూపించారు. కంటెంట్ ఇదీ అని కాని.. ప్రభాస్ పాత్ర కానీ..ఇతర కీలక అంశాలు కూడా ఏదీ చెప్పలేదీ టీజర్ లో. దీంతో ఎంతో ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ పూర్తిగా నిరాశపడ్డారు అనేది నిజం. ఈ మాత్రం ఎలివేషన్ షాట్స్ కావాలనుకుంటే కేజీఎఫ్‌ ను ఓ పదినిమిషాలు చూసినా సరిపోతుంది.

ఈ మాత్రం దానికి ఇది ప్రభాస్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాలా అనే సెటైర్స్ ఇతర అభిమానుల నుంచీ పడుతున్నాయి. నిజానికి ప్రశాంత్ నీల్ ఈ టీజర్ ను అస్సలు సరిగా కట్ చేయించలేదు అనే చెప్పాలి. విజువల్స్ పరంగా చూసుకుంటే కేజీఎఫ్‌ లో మరోసారి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని మైన్స్ ను చూస్తున్నట్టుగానే ఉంది. కనిపించిన ఒకటీ అరా పాత్రలు కూడా కేజీఎఫ్‌ నే తలపిస్తున్నాయి తప్ప ఒక్కటీ కొత్తగా అనిపించలేదు. అదే వాయిస్.. అదే బిల్డప్.


టీనూ ఆనంద్ వేరే దేశంలో నీగ్రోల మధ్య ఉండి.. తన గురించి అరుస్తున్నవారిని ‘సైలెంట్ అని చెప్పి.. ” లయన్, ఎలిఫెంట్, చీతా.. వెరీ డేంజరస్.. బట్.. నా డేంజరస్ ఇప్పా.. బికాజ్ఇన్ దట్‌ పార్ట్.. దేరీజ్ ఆ.. ” అన్నప్పుడు రక్తంతో తడిచిన ప్రభాస్ పిడికిలి కనిపిస్తుంది. ఫేస్ అవుట్ ఫోకస్ లో ఉండగానే రెబల్ స్టార్ ప్రభాస్ అనే టైటిల్ పడుతుంది. ఇది ఎలివేషన్ షాట్. అప్పటికి 1 నిమిషం 46 సెకన్ల టీజర్ లో 1 నిమిషం 28 సెకన్స్ అయిపోతుంది. నెక్ట్స్ పృథ్విరాజ్ లుక్.. ఆ పై టైటిల్ తో పాటు ” పార్ట్ 1 సీజ్ ఫైర్” అంటూ రిలీజ్ డేట్ వేశారు.

కనీసం ప్రభాస్ ను పృథ్వీరాజ్ లా పూర్తిగా కూడా చూపించలేదు. మరి ఈ మాత్రం దానికి అంత పొద్దున్నే జనాలను లేపి వెయిట్ చేయించడం ఏంటో కానీ.. ఈ టీజర్ మాత్రం అంచనాలను అందుకునేలా లేదు. ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదు. ఒక టీజర్ లో కనీసంగా కూడా కంటెంట్ తెలియనప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఆడియన్స్ కు ఓ చిన్న డిజప్పాయింట్ మెంట్ ఉంటుంది. సలార్ విషయంలో అది కాస్త పెద్దగానే ఉందంటే తప్పేం లేదేమో..

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

11 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

14 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

14 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

14 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

15 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

20 hours ago