టాలీవుడ్

మాస్ కు పూనకాలే అనేలా సలార్ టీజర్

ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీజర్ వచ్చేసింది. కంట్రీ మొత్తం అతని ఫ్యాన్స్ దేనికోసం ఎదురుచూస్తున్నారో అది ఇదే కదా అనిపించేలా ఉంది టీజర్. ప్రశాంత్ నీల్ తో సినిమా అన్నప్పుడే మాస్ కు ఫీస్ట్ అనుకున్నారు.బట్ అంతకు మించి చూడబోతున్నాం అనేలా ఉంది టీజర్. అసలు ఈ రేంజ్ టీజర్ ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో నుంచీ చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ లుక్, మేకోవర్ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తున్నాయి.

బాహుబలి తర్వాత సరైన బ్లాక్ బస్టర్ పడలేదు అని ఫీలవుతున్న ఫ్యాన్స్ దిగులును రెండు వందలశాతం తీర్చబోతోన్న సినిమా ఇదే అనిపించేలా ఉంది మేకింగ్ స్టైల్. మామూలుగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే స్క్రీన్ మొత్తం ఒక మూడ్ కనిపిస్తుది. కేజీఎఫ్‌ తర్వాత మరోసారి ఆ తరహా స్పెషల్ మూడ్ లోకి ఆడియన్స్ ను తీసుకువెళ్లబోతున్నాడు ప్రశాంత్ అనేలా ఉంది సలార్ టీజర్.


బాలీవుడ్ నటుడు టీనూ ఆనంద్ చెప్పే ఇంగ్లీష్‌ డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. అవి కేజీఎఫ్ లాగానే హీరో ఎలివేషన్ డైలాగ్స్. అతన్ని చంపేందుకు వందలమంది తుపాకులు ఎక్కుపెట్టి ఉంటే.. కళ్లల్లో కొంచెం కూడా భయం లేకుండా ఉంటాడు.

అందుకు కారణం.. ఏంటీ అంటే అన్నప్పుడు ప్రభాస్ లుక్ లుక్ రివీల్ అవుతుంది. అంతకు ముందే అద్భుతమైన విజువల్స్ లో మనోడు ఊచకోత కోస్తుంటాడు. ఆ విజువల్స్ తో పాటు మేకింగ్ స్టైల్ చూస్తోంటే కొంచెం కేజీఎఫ్ కూడా గుర్తొస్తుంటుంది.

కానీ ఈ సారి కొత్త కంటెంట్ అనేలా మాత్రం ఉంది. ఇక టీజర్ లో ప్రభాస్ లుక్ ను సరిగా రివీల్ చేయలేదు. అతనితో పాటు విలన్ గా నటిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ను కాస్త రివీల్ చేశారు. మొత్తంగా మాస్ కు పండగ లాంటి సినిమాతో వస్తున్నారని మాత్రం అర్థం అవుతోంది.


ఇక శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో జగపతిబాబు, శ్రీయ రెడ్డి, మీనాక్షి దీక్షిత్, మధు గురుస్వామి, టీనూ ఆనంద్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

8 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

10 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

11 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

11 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

12 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

16 hours ago