‘దేవర’ సెట్స్ లో గాయపడ్డ సైఫ్ ఆలీఖాన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్. ఇప్పటికే ప్రభాస్ ‘ఆదిపురుష్’లో లంకేషుడిగా నటించిన సైఫ్.. ‘దేవర’లో భైర పాత్రలో భయంకరంగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘దేవర’ షూటింగ్ ను జెట్ స్పీడులో కంప్లీట్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. అయితే.. ఈ సినిమాకి ఇప్పుడు సైఫ్ రూపంలో అనుకోని అవాతరం వచ్చింది. లేటెస్ట్ గా ‘దేవర’ చిత్రీకరణలో సైఫ్ ఆలీ ఖాన్ గాయపడ్డాడు. ఆయన మోకాలు, భుజానికి గాయాలయ్యాయి.

ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ట్రైసెప్స్ కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలుస్తోంది. అసలు 2017లోనే ‘రంగూన్’ సినిమా షూటింగ్ లో సైఫ్ గాయపడ్డాడు. అప్పటి గాయాలకు తోడు.. తాజాగా జరిగిన గాయాలతో సైఫ్ కి సర్జరీ చేయాల్సి వచ్చిందట. ప్రస్తుతం సర్జరీ పూర్తిచేసుకున్న సైఫ్.. వృత్తిలో భాగమే ఈ గాయాలు.. తాను క్షేమంగా ఉన్నట్టు ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేశాడు. ‘దేవర’ టీమ్ కూడా సైఫ్ ఆలీ ఖాన్ త్వరగా కోలుకుని సెట్స్ లోకి రావాలని ట్వీట్ చేసింది.

Related Posts