ఆర్.జి.వి. ‘వ్యూహం’కు పెద్ద షాక్.. సెన్సార్ సర్టిఫికెట్ రద్దు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ జారీ చేసిన సర్టిఫికెట్ ను హైకోర్టు రద్దు చేసింది. సినిమాలో వ్యక్తుల పరువుకు, హక్కులకు భంగం కలిగే అంశాలున్నాయని.. వాటిని పట్టించుకోకుండా రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ జారీచేసిందని హైకోర్టు పేర్కొంది. అలాగే.. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వ్యూహం’ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీ.బీ.ఎఫ్.‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్‌ చేశారు. దీంతో ఈ తీర్పుపై ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు ‘వ్యూహం’ చిత్ర నిర్మాత సిద్ధమవుతున్నారు.

Related Posts