పల్లవి ప్రశాంత్ ని ఘోరంగా టార్గెట్ చేశారే

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ 7 .. రోజు రోజుకూ రక్తి కడుతోంది. అప్పుడే ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తయింది. ఎలిమినేట్ అయిన పర్సన్ ఏ పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి అంతా ఊహించారు. ఇక ఈ రోజు హౌస్ లో ఉన్న 13మంది కంటెస్టెంట్స్ లో 12 మంది డైరెక్ట్ గా రైతుబిడ్డని అని చెప్పకుంటోన్న పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో చూస్తే అతని ఆట తీరు వల్ల పోటీకి వస్తున్నాడని చేస్తున్నారా లేక ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది తెలియదు కానీ.. అతను లవ్ ట్రాక్ లాంటిది మొదలుపెట్టిన రతిక కూడా మనోడిపై కమెంట్స్ చేసింది.


ముందుగా పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేయాలనుకునేవాళ్లు ముందుకు రండి అని బిగ్ బాస్ అనగానే.. షకీలా, దామిని, గౌతమ్, అమర్ దీప్, ప్రియాంక జైన్, రతిక ఇలా అందరూ ప్రశాంత్ పై కామెంట్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఈ తతంగం చూస్తే అతన్ని కంటెంస్టెంట్స్ అంతా కావాలనే టార్గెట్ చేశారు అనిపిస్తుంది.


అయితే గౌతమ్, అమర్ దీప్ మాత్రం అతన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. మాటి మాటికి రైతు బిడ్డని అని చెప్పుకోవద్దు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. నేనే చేసే పనిని గర్వంగా చెప్పుకుంటా అని ప్రశాంత్ అన్నాడు. దానికి నువ్వు నేను చెప్పేది విను ఫస్ట్ అంటూ ప్రియాంక జైన్ స్ట్రాంగ్ గా మాట్లాడింది. ఇక నువ్వు ఒక పోస్ట్ పెడితే ఒక లక్షరూపాయలు ఇస్తరు మచ్చా అని గౌతమ్ అంటే.. ఆ లక్ష నేను తీసుకోను అన్నా.. ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తా అని ప్రశాంత్ అన్నాడు.


దీనికి అమర్ దీప్ ఓ రేంజ్ లో ఊగిపోతూ.. “గౌతమ్ ఇచ్చే డబ్బులు ఒక రైతు బిడ్డకు ఇస్తానంటన్నావే గాని.. ఆ రైతు ప్లేస్ లో ఒక రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్ వాళ్లకు ఇస్తా అని చెప్పవే” అంటూ ఫైర్ అయ్యాడు. అది విన్న తర్వాత ప్రశాంత్ భుజం ఎత్తుకుని పుష్పలా ఉంటే.. భుజం భుజం దించు అంటాడు అమర్. అందుకు ప్రశాంత్ సలివెడుతుందన్నా అన్నాడు..

“ఇప్పుడు నువ్వు ఏ బాడీ లాంగ్వేజ్ అయితే వాడుతున్నావో.. ఇదే బాడీ లాంగ్వేజ్ లో నువ్వు వీడియోల్లో ఎందుకు నేను బిగ్ బాస్ కు వస్తా అని రిక్వెస్ట్ చేయలేకపోయావో చెప్పరా” అంటూ ఘాటుగా మాట్లాడు.. ” బిటెక్ చేసినోడు కష్టాలు తెలుసా నీకు.. సదివేసి ఏదో ఊరికిపోయి ఏ జాబ్ చేస్తున్నామో కూడా తెలియకుండా.. తిండీ తిప్పలు లేక మళ్లీ పొద్దున్న లేసి అదే జాబ్ చేసుకుంటూ.. సచ్చిపోయినార్రా.. ఇప్పటిదాకా శవాలు కూడా దొరకలేదు తెల్సా.. అలాంటోళ్లకు ఏం చెప్తావ్” అంటూ మళ్లీ ఊగిపోయాడు.. దీనికి హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ తో అమర్ ను అప్రిసియేట్ చేశారు. మొత్తంగా మాట్లాడితే రైతు బిడ్డ అంటూ సెంటిమెంట్ యాక్టింగ్ చేయొద్దంటూ అమర్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి ఆట సందీప్ కూడా తోడై.. ‘భారతదేశంలో పుట్టినోళ్లందరూ రైతులేరా.. మా తాతలు కూడా రైతులేరా.. ‘ అనేసరికి ప్రశాంత్ ఫీలైపోయాడు..


6కి ఇదే స్టూడియో ముంగట కుక్కలాగా తిరిగిన అన్నా అంటూ ఏడుస్తుంటే.. ” కుక్కలా తిరిగి అవకాశం వొచ్చింతర్వాత ఇక్కడొచ్చి ఏం చేస్తున్నవ్..” అనే సరికి ప్రశాంత్ అవాక్కయ్యాడు. ఏదేమైనా ఈ ప్రోమోలో పెద్దన్నగా చెబుతున్న శివాజీ కూడా ఉన్నాడు. బట్ కామ్ గా ఉన్నాడు. మరి ప్రశాంత్ ను ఆ రేంజ్ లో టార్గెట్ చేయడం వెనక స్కీమ్ ఏంటో కానీ.. ఈ ప్రోమోతో అతనికి సింపతీ వచ్చే అవకాశం ఉంది.

ఇక చివర్లో డాక్టర్ గౌతమ్.. ” దీన్ని నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. వాళ్లొక్కళ్లదే కరెక్ట్ అనిపిస్తది.. మిగతా అందరిదీ తప్పనిపిస్తదన్నమాట..” అన్నాడు. దానికి కౌంటర్ గా ప్రశాంత్.. ‘దీనికి గోలీలుంటయా డాక్టర్” అని అడిగితే ఉటయని గౌతమ్ అన్నాడు. ” సరే ఇంటికి పోయేటప్పుడు తీస్కపోత” అనడం పంచింగ్ గా బలే పేలింది..

Related Posts