‘గామి’ పై జక్కన్న ప్రశంసల వర్షం

విశ్వక్‌సేన్ డిఫరెంట్ అటెంప్ట్ గామి. చాందినిచౌదరి ,అభినయ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం కార్తీక్‌ శబరీష్ నిర్మాణంలో వి సెల్యులాయిడ్ సపోర్ట్‌తో అతిపెద్ద కాన్వాస్‌తో రెడీ అయింది. మార్చి 8 న మహాశివరాత్రి సందర్భంగా గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబోతుంది. ఈ చిత్రానికి విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌ చేసారు. ఈ సినిమాకి సినీ సెలబ్రిటీల స్పందన చాలా ప్లస్‌ అయ్యింది. టీజర్, ట్రైలర్‌ , లిరికల్ సాంగ్స్‌తో విమర్శకుల ప్రశంసలు పొంది ఓ గొప్ప సినిమాని తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారనే మాట గట్టిగా వినిపిస్తుంది.


ముఖ్యంగా ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్‌, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రశంసించడం విశేషం. “అసాధ్యమైన కలని సాకారం చేయాలంటే అహర్నిశలు కష్టపడాలని నిర్మాత కార్తీక్ , దర్శకుడు విద్యాధర్ నన్ను కలుసుకుని, అద్భుతమైన విజువల్స్ సాధించడంలో వారి 4 సంవత్సరాల కృషి గురించి మాట్లాడినప్పుడు అనిపించింది. మార్చి 8న విడుదల కానున్న #గామి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నారు రాజమౌళి.

Related Posts