‘ఆర్.సి.17’ని ఆకాశానికెత్తేస్తోన్న తండ్రీకొడుకులు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కిట్టీలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా మూడు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. వీటిలో శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే చివరిదశకు చేరుకోగా.. బుచ్చిబాబుతో చేయబోతున్న చరణ్ 16వ సినిమా ఇటీవలే ముహూర్తాన్ని జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక.. లేటెస్ట్ గా తనకు ‘రంగస్థలం’ వంటి కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చిన సుకుమార్ తో మరోసారి కలిసి పనిచేస్తున్నాడు చరణ్. హోలీ స్పెషల్ గా చరణ్-సుక్కూ ‘ఆర్.సి.17’ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది.

‘రంగస్థలం’ కాంబో రిపీట్ అవ్వబోతుందంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసేలా.. తండ్రీకొడుకులు రాజమౌళి, కార్తికేయ ‘ఆర్.సి.17’ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి చెప్పిన మాటలు ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి. సుకుమార్ తో చేయబోయే సినిమా గురించి చరణ్ చెప్పాడని రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంటర్యూలలో చెప్పాడు. ‘ఆర్.సి.17’ ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుందని.. ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్ పై చూడని నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందించబోతుందని జక్కన్న అన్నాడు.

లేటెస్ట్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ‘ఆర్.సి.17’ ఓపెనింగ్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. ఐదు నిమిషాల పాటు సాగే ఆ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతుందని సిల్వర్ స్క్రీన్ పై ఒన్ ఆఫ్ ది ఐకానిక్ సీక్వెన్సెస్ లో ఒకటి అవుతుందని కార్తికేయ ట్వీట్ చేశాడు.

Related Posts