బాలయ్య, బోయపాటి ‘లెజెండ్’ రీరిలీజ్

బాలయ్య కెరీర్‌లో బోయపాటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. బాలయ్య కెరీర్‌ అయిపోతుందనుకున్న టైమ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి ఆడియెన్స్‌ చేత జై బాలయ్య అనిపించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ సినిమా రిలీజై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా మార్చి 30 న రీరిలీజ్ చేస్తోంది చిత్ర మేకర్స్‌. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.


రీ-రిలీజ్ ట్రైలర్‌లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమా ప్రిమైజ్ ని మరోసారి అద్భుతంగా చూపించారు. ఆ సినిమాతో విలన్‌గా మారిన జగపతి బాబు ఆ తర్వాత అత్యంత బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరిగా మారారు.ఈ బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts