‘వెంకీ’ సీక్వెల్ తీస్తానంటోన్న శ్రీను వైట్ల

కమర్షియల్ పంథాలో సాగుతూనే.. తన మార్క్ కామెడీ హంగులతో.. సినిమాలను సూపర్ హిట్స్ చేయడంలో సిద్ధహస్తుడు శ్రీను వైట్ల. అయితే.. కొన్నేళ్లుగా ఈ సీనియర్ డైరెక్టర్ కి విజయాలే కరువయ్యాయి. ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ తో ఒక సినిమాని తీస్తున్న శ్రీను వైట్ల.. ఆ తర్వాత తన సూపర్ హిట్ మూవీస్ కి సీక్వెల్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే విష్ణుతో ‘ఢీ’ సీక్వెల్ ని అనౌన్స్ చేసిన శ్రీను వైట్ల.. లేటెస్ట్ గా మాస్ మహారాజ ‘వెంకీ’కి కూడా సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే.. 2004, మార్చి 26న ‘వెంకీ’ సినిమా రిలీజయ్యింది. కోన వెంకట్, గోపీ మోహన్ తో కలిసి శ్రీను వైట్ల వండి వార్చిన ‘వెంకీ’ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ముఖ్యంగా ‘వెంకీ’ చిత్రంలో కామెడీ ట్రాక్ హైలైట్. ఫస్టాఫ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఇప్పుడు ‘వెంకీ’ సీక్వెల్ ని కూడా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ప్రస్తుతం ‘వెంకీ 2’కి స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు లేటెస్ట్ గా ఓ ఇంటర్యూలో తెలిపాడు. మొత్తంమీద.. మరోసారి రవితేజ-శ్రీనువైట్ల కలిసి సిల్వర్ స్క్రీన్ పై ‘వెంకీ’ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాలి.

Related Posts