టాలీవుడ్

రవితేజ వరుసగా రెండు రీమేక్ లు

టాలీవుడ్ లో ఒక్కొక్కప్పుడు ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. ఒకప్పుడు రీమేక్ లు చేస్తే సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అవే రీమేక్ లు సూపర్ ఫ్లాప్స్ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో ఆ ట్రెండ్ కు కొన్నాళ్లు బ్రేక్ వేస్తారు ఎవరైనా. బట్ మాస్ మహరాజ్ రవితేజ ఆ బ్రేక్ లు పట్టించుకోవడం లేదు. ఈ ఫ్లాపులూ చూడ్డం లేదు. అందుకే వరుసగా ఓ రెండు సినిమాలు రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మరో మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు అనిపించాడు. పైగా ఇది బయోపిక్ లాంటి స్టోరీ కూడా కావడంతో ఆడియన్స్ లోనూ ఓ రకమైన క్రేజ్ ఉంది. మరోవైపు ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసమే రీసెంట్ గా విదేశాలకు వెళ్లాడు. ఈగల్ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఒకేసారి మరో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసి ఉన్నాడు. ఆ రెండూ రీమేక్ లే కావడం విశేషం.


నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో రీమేక్ లు బాగా దెబ్బ కొడుతున్నాయి. అయినా మాస్ రాజా ధైర్యం చేస్తున్నాడు అంటే కారణం.. ఆ రెండు సినిమాలూ తెలుగులో డబ్ కాలేదు. అలాగే ఆ రెండు సినిమాలు తీసే దర్శకులు. వీటిలో మొదటిది బాలీవుడ్ మూవీ రైడ్. 2018లో అజయ్ దేవ్ గణ్ నటించిన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరో ఓ సిన్సియర్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్.

తెలుగులో అప్పట్లోనే రవితేజ తో పాటు మరికొందరు హీరోలు రీమేక్ చేస్తారు అనే టాక్ వచ్చింది. అప్పుడు వర్కవుట్ కాలేదు. బట్ ఇప్పుడు ఓకే అయింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. రీమేక్ సినిమాలను హరీష్‌ శంకర్ డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ఆ సినిమాలను తెలుగులోకి పర్ఫెక్ట్ గా అడాప్ట్ చేయడమే కాదు.. తనదైన స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ను కూడా యాడ్ చేస్తాడు. ఇక దర్శకుడుగా తనకు లైఫ్ ఇచ్చిన రవితేజతో చాలాకాలం తర్వాత సినిమా చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఈ కథ, కథనం ఉంటుందనుకోవచ్చు. అందుకే రవితేజ ధైర్యంగా ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేశాడు.


ఇక రెండో సినిమా తమిళ్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదా. విక్రమ్ వేదాను కూడా తెలుగులో చేయాలని చాలామంది ప్రయత్నించారు. ఎవరికీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గా బాలీవుడ్ లో రీమేక్ చేశారు. బట్ అప్పుడు బాలీవుడ్ బాగా డౌన్ ఫాల్ లో ఉంది. అందుకే బావున్నా.. ఈ రీమేక్ ను అక్కడ చూడలేదు. బట్ తెలుగులో రవితేజ చేస్తున్నాడు అంటే చెప్పేదేముందీ.. ఈ చిత్రంలో ఇద్దరు హీరోలుంటారు.

రవితేజ .. విజయ్ సేతుపతి పాత్ర చేస్తాడు. మరో పాత్ర కోసం జొన్నలగడ్డ సిద్ధును అనుకుంటున్నారు అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అతనింకా ఓకే చెప్పలేదు. లేదంటే విశ్వక్ సేన్, రానా, శర్వానంద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

బట్ ఈ ప్రాజెక్ట్ తెలుగులో వస్తోంది. ఈ మూవీకి దర్శకుడుగా కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ ను ఎంచుకున్నాడు రవితేజ. సందీప్ చేసిన మార్పులు మాస్ రాజాకూ బాగా నచ్చాయట. అందుకే దర్శకత్వం కూడా అతనికే ఇచ్చాడు. ఈ మూవీకి సంబంధించి పెద్దగా మార్పులు కూడా అక్కర్లేదు. మక్కీకి మక్కీ తీసినా మాస్ రాజా ఇమేజ్ తో హిట్ అయిపోతుంది. సో.. ఈ రెండు రీమేక్ లతో నెక్ట్స్ ఇయర్ సందడి చేస్తాడు రవితేజ. మరి ఈ యేడాది వచ్చిన రీమేక్ రిజల్ట్స్ ను బ్రేక్ చేసి నెక్ట్స్ ఇయర్ రవితేజ బ్లాక్ బస్టర్స్ కొడతాడేమో చూడాలి.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago