వరుణ్ తేజ్ కొత్త ఆపరేషన్

మెగా ఫ్యామిలీ నుంచి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌. కానీ ఈ మధ్య కాలంలో సరైన విజయం పడలేదు. ఈ నెల 25న గాండీవధారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అతను ఓ ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ బావుంది. ప్రామిసింగ్ గా కనిపిస్తుందని చెప్పలేం కానీ.. ఏదో కొత్త ఎలిమెంట్ ఉన్నట్టు అర్థం అవుతోంది. ఈ మూవీ తర్వాత రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో అల్లుకున్న కథతో వస్తున్నాడు వరుణ్ తేజ్.

ఆల్రెడీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేసింది టీమ్. “ఆపరేషన్ వాలంటైన్” ఇదే వరుణ్ కొత్త సినిమా టైటిల్. కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఇందులో వరుణ్ పైలెంట్ గా నటించాడు. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది.

విశేషం ఏంటంటే.. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చింది. డిసెంబర్ 8న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అంటే నాలుగు నెలల్లోనే రెండు సినిమాలు వస్తున్నాయన్నమాట. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. మొత్తంగా గాండీవధారి విజయం సాధిస్తే అది ఖచ్చితంగా ఆపరేషన్ వాలంటైన్ కు మరింత ప్లస్ అవుతుంది. మరి ఈ రెండు సినిమాలతో వరుణ్ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటాడో చూడాలి.

Related Posts