రన్‌బీర్ కపూర్ గొప్ప స్టార్ : మహేశ్ బాబు

తాజాగా ‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యమానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరవడంతో ఈవెంట్ కి భారీ స్థాయిలో హైప్ వచ్చింది. రొటీన్ కి భిన్నంగా ప్లాన్ చేసిన యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సాక్సెస్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రన్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ డిసెంబర్ 1న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఎవెంట్ కి హాజరైన మహేశ్ హీరో గురించి ప్రశంసల వర్షం కురిపించాడు. రన్‌బీర్ గొప్ప నటుడని మహేశ్ కితాబిచ్చాడు. ‘యానిమల్’ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందని అన్నాడు. ఇక టీమ్ బలవంత పెట్టడంతో మహేశ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’ లోని ‘డోలె డోలే’ పాటకి చిన్న స్టెప్ వేసి అందరినీ అలరించాడు.

Related Posts