రామ్ చరణ్‌ తో దీపికా, త్రిష.. మేటర్ ఏంటీ..?

సోషల్ మీడియా పెరిగిన తర్వాత చిన్న హింట్ కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ కు దారితీస్తోంది. అలా రీసెంట్ గా రామ్ చరణ్‌, దీపికా పదుకొనె త్రిష ఉన్నట్టుగా ఓ లీక్డ్ ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఆ మేటర్ వైరల్ అయింది. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా రాబోతోందా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఇక వీరికి తోడు రణ్‌వీర్ సింగ్ కూడా కనిపించాడు. ఇంకేముందీ.. భారీ మల్టీస్టారర్ అంటూ కథనాలు మొదలయ్యాయి.

బట్ మేటర్ సినిమా కాదు. ఒక యాడ్. యస్.. ఈ నలుగురూ కలిసి ఒక యాడ్ లో నటించారు. ఈ మధ్య కాలంలో దాదాపు అందరి ఫోన్స్ లోనూ కనిపిస్తోన్న యాప్ మీషో యాప్. మంచి షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తోన్న యాప్ ఇది. ఈ యాప్ కోసమే ఈ నలుగురూ కలిసి ఒక యాడ్ చేశారు. ఆ యాడ్ కు సంబంధించిన ఫోటోసే అవి.


ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన దీపికా పదుకొనె ‘ సర్ మా ఆయన నిన్న రాత్రి కనిపించడం లేదు’ అని కంప్లైంట్ చేస్తుంది. కట్ చేస్తే రణ్‌వీర్ సింగ్ వెంటనే సార్ టార్గెట్ ఫౌండ్ అంటాడు. మరోవైపు ఏజెంట్ గో.. గో.. గో.. అనే సౌండ్ వినిపించగానే రామ్ చరణ్ పరుగులు పెడుతుంటాడు. ఒక వ్యక్తిని పట్టుకుని చెప్పరా అంటూ నిలదీస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

మొత్తంగా ఈ యాడ్ ఇప్పుడు క్రేజీగా కనిపిస్తోందనే చెప్పాలి. అసలే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రూమర్స్ వస్తున్నాయి. అలాంటిది ఇంత పెద్ద స్టార్స్ కలిసి కనిపిస్తే ఎన్ని వార్తలు వస్తాయి. అందుకే అన్ని రూమర్స్ వచ్చాయి. బట్ ఇదో యాడ్ అని తేలిపోయింది.


విశేషం ఏంటంటే.. ఈ యాడ్ లో త్రిష.. రామ్ చరణ్‌ కు పెయిర్ గా నటిస్తోంది. దీపికా, రణ్‌వీర్ సింగ్ ఒక పెయిర్. మరో విశేషం.. ఏంటంటే.. త్రిష యాడ్ లో చరణ్‌ కు పెయిర్ గా నటిస్తూనే త్వరలోనే సినిమాలో చిరంజీవికి జోడీగా నటించబోతోంది. నటనా వైచిత్రి అంటే ఇదే.

Related Posts