13యేళ్ల తర్వాత రవితేజతో సినిమా

స్టార్ డైరెక్టర్ హరీష్‌ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా తమిళ్ లో వచ్చిన తెరి చిత్రానికి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని హరీష్‌ శంకర్ అనేక మార్పులు చేసి ఉన్నాడు.

గబ్బర్ సింగ్ లాగా కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే మరో షెడ్యూల్ కు వెళ్లబోతోంది. అయితే ఈ సినిమా కోసమే ఇన్నాళ్లూ ఖాళీగా, కామ్ గా ఎదురుచూసిన హరీష్‌ శంకర్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నాడు.


దర్శకుడుగా తనకు ఫస్ట్ ఛాన్స్ తో పాటు హిట్ కొట్టేందుకు మరో అవకాశం ఇచ్చిన మాస్ మహరాజ్ రవితేజ తో హరీష్‌ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడు. హరీష్‌ ను షాక్ మూవీతో దర్శకుడుగా పరిచయం చేసింది రవితేజనే. షాక్ బాక్సాఫీస్ వద్ద పోయింది. దీంతో తనే మళ్లీ మిరపకాయ్ తో అవకాశం ఇచ్చాడు. ఇది సూపర్ హిట్ అయింది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించింది.

ఈ సక్సెస్ తో హరీష్‌ శంకర్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తూ వెళుతున్నాడు. గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్‌ కు అప్పటికి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇన్నాళ్లకు మళ్లీ పవన్ తోనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాతే రవితేజ సినిమా ఉంటుంది.


ఇక రవితేజ – హరీష్‌ శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఈ నెలలోనే ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అదే టైమ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తంగా మిరపకాయ్ సినిమా వచ్చి ఇప్పటికి పదమూడేళ్లవుతోంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే మంచి అంచనాలే పెట్టుకోవచ్చేమో.

Related Posts