దేవర అప్డేట్ వచ్చేసింది.

మ్యాన్ ఆఫ్‌ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న దేవర మూవీ షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలైనా.. స్టార్ అయిన తర్వాత జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుందంటే ఆశ్చర్యం కాదు.. షాక్ తినాల్సి ఉంటుంది. అంత స్పీడ్ గా ఉంది వీరి దూకుడు.

ఇక లేటెస్ట్ గా ఐదో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారట.అయితే ఈ షెడ్యూల్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఒకే షెడ్యూల్ లో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. లాస్ట్ షెడ్యూల్ సముద్రం సెట్ లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఒకే షెడ్యూల్ లో రెండు హై ఓల్టేజ్ ఫైట్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ నుంచే ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.


దేవర నుంచి ఐదో షెడ్యూల్ లో మొదటి ఫైట్ ను పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో ఓ పెద్ద ఫైట్ షూటింగ్ చేయబోతున్నారట. ఈ సీన్ రేపటి నుంచే అంటే ఈ మంగళవారం నుంచే ప్రారంభం కాబోతోంది. ఈ ఫైట్ లో ఎన్టీఆర్ ఎమోషన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని చెబుతున్నారు.

ఇక మరో ఫైట్ ను సాల్మన్ మాస్టర్ సారథ్యంలో చిత్రీకరించబోతున్నారు. ఇంకా బాగా ఫేమస్ కాలేదు కానీ.. సాల్మన్ మాస్టర్ ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉన్నవాడు ఇతను. అంటే భారీ కాన్వాస్ ఫైట్ నే ఈ మాస్టర్ నుంచి ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.


మొత్తంగా దేవర షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోందంటే కారణం.. దీని తర్వాత వెంటనే వార్ 2 షూటింగ్ కోసం రెడీ కావాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కూడా వెయిట్ చేస్తోంది. ఈ రెండిటికి సరైన టైమ్ ఇవ్వాలంటే ఇప్పుడు టైమ్ వేస్ట్ చేయకుండా దేవరను పూర్తి చేయాలి. అందుకే ఎన్టీఆర్ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్, టామ్ చాకో విలన్లుగా నటిస్తున్నారు. 2024 సమ్మర్ లో ఏప్రిల్ 5న దేవర ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Related Posts