ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు. అసలు చరణ్ కి చిన్నప్పట్నుంచే అయ్యప్ప స్వామిపై భక్తి ఉందట. మాల వేసుకున్నా వేసుకోకపోయినా చిన్న వయసు నుంచే అయ్యప్ప దర్శనం చేసుకుని రావడం రామ్ చరణ్ కి అలవాటు.

గత కొన్ని సంవత్సరాలుగా చరణ్ అయ్యప్ప మాలలో కనిపిస్తూనే ఉన్నాడు. ఒకవైపు సినిమాలతో కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా మాలను మాత్రం స్వీకరిస్తూనే ఉన్నాడు.

అయ్యప్ప దీక్ష అంటేనే ఎన్నో నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయ్యప్ప మాలలో నలుపు రంగు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. చెప్పులను ధరించకూడదు. ఆ నియమ నిబంధనల్ని పాటిస్తూ అయ్యప్ప స్వామిపై తన అనితర భక్తిని చాటుకోవడం ఆదర్శనీయం. అయ్యప్ప మాలలో ఉన్న చరణ్ తాజాగా ముంబై లోని సిద్ధి వినాయకుని ఆలయాన్ని సందర్శించాడు. అక్కడ మెగాపవర్ స్టార్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సినిమాల విషయానికొస్తే ‘ఆర్.ఆర్.ఆర్‘తో గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ.. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్‘ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని శంకర్ తనదైన స్టైల్ లో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘గేమ్ ఛేంజర్‘ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Related Posts