ఫిబ్రవరి 9న రజనీకాంత్ ‘లాల్ సలామ్‘

ఒకప్పుడు వరుసగా అగ్ర దర్శకులతో సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈకోవలోనే.. తన కుమార్తె ఐశ్వర్య డైరెక్షన్ లోనూ నటించడానికి సై అన్నాడు. ఐశ్వర్య దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ‘లాల్ సలామ్‘ పొంగల్ స్పెషల్ గా రిలీజవ్వాల్సి ఉంది. అయితే.. లేటెస్ట్ గా ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా ‘లాల్ సలామ్‘ను విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మతాలు, కులాల మధ్య చిచ్చులు పెడుతుంటారు. దీని వ‌ల్ల ఎలాంటి నష్టం జరుగుతోంది అనే నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించింది డైరెక్టర్ ఐశ్వర్య. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్‌ గా రజనీకాంత్ కనిపించబోతున్నాడు. ఇతర కీలక పాత్రల్లో విష్ణు విశాల్‌, విక్రాంత్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts