HomeMoviesటాలీవుడ్RRR అసలు కథ బయటపెట్టిన రాజమౌళి..క్లైమాక్స్ మొత్తం మార్చేసిన జక్కన్న

RRR అసలు కథ బయటపెట్టిన రాజమౌళి..క్లైమాక్స్ మొత్తం మార్చేసిన జక్కన్న

-

దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ఆర్.ఆర్.ఆర్‘ అంతర్జాతీయంగా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టేట్, నేషనల్ అవార్డ్స్ తో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో ప్రెస్టేజియస్ అవార్డ్స్ ను ‘ఆర్.ఆర్.ఆర్‘ దక్కించుకుంది. ఒకవిధంగా ‘బాహుబలి‘తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళికి.. ‘ఆర్.ఆర్.ఆర్’ అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ గా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశారు.

వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.1236 కోట్లు వసూళ్లు సాధించిన ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి రాజమౌళి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా జెన్నీ పాత్రలో బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించింది. అంతకుముందు ఆ పాత్రకు మరో బ్రిటీష్ యాక్ట్రెస్ డెయిసీ ఎడ్గర్ జోన్స్ ని అనుకున్నారు. ఆ తర్వాత ఒలివియాని ఫైనల్ చేశారు.

ఇక.. ఆన్ స్క్రీన్ లో ఎన్టీఆర్, ఒలివియా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. ఎన్టీఆర్ పోషించిన భీమ్ పాత్రను ఆమె అంకుల్, ఆంటీ ఇబ్బందులు పెట్టే సన్నివేశాల్లో ఆమె తెరపై చూపించిన బాధ వర్ణనాతీతం. అయితే.. ఒరిజినల్ వెర్షన్ లో ఒలివియా పోషించిన జెన్నీ పాత్ర చనిపోతుందట.

ఒరిజినల్ ‘ఆర్.ఆర్.ఆర్’ క్లైమాక్స్ ఎపిసోడ్ లో గవర్నర్ స్కాట్.. భీమ్ ను పట్టుకోవడానికి జెన్నీకి గన్ ఎక్కుపెట్టడం.. భీమ్ లొంగకపోవడంతో ఆమెను షూట్ చేయడం జరుగుతుందట. అయితే.. అది అంతలా వర్కవుట్ అవుతోందా? లేదా? అని ఆ తర్వాత క్లైమాక్స్ ను మార్చేశాడట జక్కన్న. అదే విషయాన్ని రాజమౌళి చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవీ చదవండి

English News