మహేష్ సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు వాళ్లు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేసే సినిమా గురించి. ఇప్పటివరకూ అధికారికంగా ముహూర్తాన్ని జరుపుకోని మహేష్ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.

ప్రస్తుతం జపాన్ లో విహరిస్తున్న జక్కన్న.. ‘ఆర్.ఆర్.ఆర్’తో పాటు మహేష్ బాబు సినిమా గురించి అక్కడ ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు ముచ్చటించాడు. తన తర్వాతి సినిమాకి మిగతా కాస్టింగ్ ఎవరూ ఫైనల్ కాకపోయినా.. హీరో ఫిక్సయ్యాడని.. అతని పేరు మహేష్ బాబు అని జపాన్ ఫ్యాన్స్ కి వివరించాడు జక్కన్న. మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడని.. చాలా తొందరగా సినిమాని ఫినిష్ చేసి అతన్ని మీముందుకు తీసుకొస్తానని జపాన్ ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు.

ఇక.. జపాన్ ఆడియన్స్ తో తన స్పీచ్ లో మహేష్ బాబు సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యిందని వివరించాడు. తన గత చిత్రాలకంటే చాలా వేగంగా ఈ సినిమాని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్టు వాళ్లకు తెలిపాడు. మొత్తంమీద.. మహేష్ బాబు కోసం రాజమౌళి పక్క ప్లానింగ్ తో రెడీ అవుతున్నాడన్నమాట.

మరోవైపు జపాన్ లోని ఓ 83 ఏళ్ల ఫ్యాన్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు రాజమౌళి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఎంతో అమితంగా అభిమానించిన ఆమె.. వేలాదిమంది జనంలో తనను కలవడానికి వచ్చిందని.. తనకు మంచి గిఫ్ట్ ఇచ్చిందని రాజమౌళి ఆమెతో కలిసిన ఫోటోలను ట్వీట్ చేశాడు.

Related Posts