కల్కిలో రాజమౌళి..

ఇండియాస్ బిగ్ మూవీగా చెబుతున్న సినిమా కల్కి 2898ఏడి. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం హాలీవుడ్ మూవీస్ కు గట్టి పోటీ ఇస్తుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమా ఇండియాలోనే రాలేదు అని బలంగా చెబుతున్నారు. నిజమే.. ఫ్యూచర్ లోకి వెళుతూ వివిధ గెలాక్సీలను కలుపుతూ దానికి మనదైన పురాణాలను మిక్స్ చేస్తూ హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో వస్తున్నారు.

దీనికి తోడు బలమైన కాస్టింగ్ కూడా ఈ సినిమాకు బిగ్ ఎసెట్ గా కనిపిస్తోంది. అన్నిటికంటే లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు అనే వార్త దేశవ్యాప్తంగా వైరల అయింది. ఆయనకంటే ముందే ప్రభాస్ సరసన దీపికా పదుకోణ్ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అమితాబ్ బచ్చన్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్నాడు.
నాగ్ అశ్విన్ ఇప్పటి వరకూ చేసింది రెండు సినిమాలు మాత్రమే. అయినా అతన్ని నమ్మి వందల కోట్లు బడ్జెట్ పెడుతున్నాడు నిర్మాత అశ్వనీదత్.

మొదట ఒక పార్ట్ గానే స్టార్ట్ అయినా తర్వాత రెండు భాగాలుగా విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన వినిపిస్తోన్న సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే.. దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అది తెరపైనా తెర వెనకా అనేది ఇంకా తెలియదు. బల్ రాజమౌళి ఈ సినిమాలో భాగం అయ్యాడు అనే వార్త వైరల్ గా మారింది. కొందరేమో అతను ఓ బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు అని చెబుతుంటే.. మరికొందరేమో.. కమల్ హాసన్ కు సంబంధించిన పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు అంటున్నారు.

డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. కానీ నటించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది నాగ్ అశ్విన్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ డ్రీమ్ ను మరొకరితో షేర్ చేసుకుంటాడు అనుకోలేం. అందుకే జక్కన్న ఓ పాత్ర చేసే అవకాశం ఉంది.
ఈ పాత్ర సినిమాలో కీలకమైన మలుపుకు కారణం అవుతుందట. అలాంటి రోల్ ను ఒక అనెక్స్ పెక్టెడ్ పర్సన్ చేస్తే ఆడియన్స్ కు ఓ కొత్త కిక్ వస్తుందనే కారణంతో పాటు రాజమౌళి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపూ వస్తుంది. అందుకే ఈ పాత్రను ఆయనతో చేయించారు అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలేంటనేది త్వరలోనే తెలుస్తాయి.

Related Posts