అల్లు అర్జున్ సర్ ప్రైజింగ్ వీడియో

ఐకన్ స్టార్ నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ స్టైలింగ్ లోనే కాదు.. తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో కూడా ఈ తరం హీరోలకు పూర్తి భిన్నంగా ఉంటాడు. అతని పిఆర్ టీమ్ ఇతరులకంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది.

అందుకే కేరళ, ముంబై వంటి ప్రాంతాల్లో కూడా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు. అఫ్ కోర్స్ ఈ అభిమానం సినిమాల ద్వారా మొదలైనా.. తను అందరికంటే స్పెషల్ అని ప్రూవ్ చేసుకునేది డిఫరెంట్ యాక్టివిటీస్ తోనే కదా.. ఆ విషయంలోనే అల్లు అర్జున్ ఎప్పుడూ బెస్ట్ అనిపించుకుంటాడు.

https://www.facebook.com/TeluguCinemaLove/videos/256314330693293

ఇప్పుడు చేసిన ఇన్ స్టాగ్రామ్ వీడియో కూడా అలాంటిదే. ఇంకా చెబితే ఈ తరహా వీడియో ఇప్పటి వరకూ ఏ హీరో చేయలేదు. ఇక ముందు ఎవరు చేసినా అతన్ని అనుసరించినట్టుగానే ఉంటుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందీ అంటే.. ఒక స్టార్ హీరోగా తన డే ఎలా మొదలవుతుంది అనే దగ్గర నుంచి మొదలుపెట్టాడు. తన ఇంట్లో ఉదయం ఎన్నిగంటలకు లేస్తాడు. తను ఎక్కడ వర్కవుట్స్ చేస్తాడు. సన్ లైట్ కోసం ఇంట్లో ఏర్పాట్లు ఏంటీ.. వంటివి చూపిస్తూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప మూవీ సెట్స్ వరకూ తన ప్రయాణం.. ప్రతి రోజు మధ్యాహ్నం 1గంటలకు ఖచ్చితంగా పిల్లలకు వీడియో కాల్ చేయడం వరకూ చూపించాడు.

అలాగే తన జర్నీలో ఎదురయ్యే ఫ్యాన్స్ కు హాయ్ చెప్పడం నుంచి మేకప్, షూటింగ్, ప్యాకప్ వరకూ ఎలా ఉంటాయి అనే అంశాలను తన డైరెక్టర్ తో ఉన్న ర్యాపోను ఎక్స్ ప్లెయిన్ చేస్తూ సాగిన ఈ వీడియో మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్పాడు. దీని వల్ల అల్లు అర్జున్ అనే ఇండియన్ స్టార్ వాల్డ్ వైడ్ గా పరిచయం అవుతాడు.


సో.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన ఈ వీడియో షూట్ కోసం ప్రత్యేకమైన మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరహా షూట్ చేయడంలో వాళ్లు ఎక్స్ పర్ట్స్ అట. నిజంగా కూడా వీడియో షార్ట