టి.వి. కమర్షియల్ లో అదరగొట్టిన రాజమౌళి, డేవిడ్ వార్నర్

దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. అసలు ఈ ఇద్దరికీ సంబంధమే లేదు. అయినా.. వీరిద్దరినీ ఒకే ఫ్రేములోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ‘క్రెడ్‘ సంస్థ. తమ యు.పి.ఐ. పేమెంట్స్ అడ్వర్ టైజ్ మెంట్ కోసం రాజమౌళి, వార్నర్ లతో కలిసి ఓ యాడ్ ను షూట్ చేసింది. డైరెక్టర్స్ కట్ ఫీట్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో రాజమౌళి దర్శకుడిగా ఏవో సూచనలు ఇవ్వడం.. డేవిడ్ వార్నర్ పలు పీరియడ్ లుక్స్ లో అదరగొట్టడం ఆకట్టుకుంటుంది. డేవిడ్ వార్నర్ మన తెలుగు హీరోలు నటించిన సినిమాల్లోని డైలాగ్స్, గెటప్స్ తో టిక్ టాక్స్ చేయడంలో దిట్ట. అందుకే.. అతన్నే ప్రత్యేకంగా ఈ యాడ్ కోసం ఉపయోగించుకుంది ‘క్రెడ్‘. ప్రస్తుతం రాజమౌళి, డేవిడ్ వార్నర్ యాడ్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

Related Posts