చరణ్ కి డాక్టరేట్ రావడంపై అభినందనలు తెలిపిన పవన్..!

చిరు తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. అనతి కాలంలోనే గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఘనత సాధించాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ‘మగధీర‘ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్‘ వరకూ ఎన్నో అత్యద్భుతమైన అవార్డులను తన ఖాతాలో వేసుకున్న చరణ్.. తాజాగా తమిళనాడులోని వెల్స్ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకోబోతున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి అభినందనలు తెలుపుతూ ఓ ప్రెస్ నోట్ జారీ చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్.

‘చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కి డాక్టరేట్ రావాడం ఎంతో ఆనందం కలిగించింది అని.. రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం‘ అంటూ ఈ ప్రెస్ నోట్ లో తెలిపాడు పవర్ స్టార్. అబ్బాయ్ కి అభినందనలు తెలుపుతూ బాబాయ్ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Posts