అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘యాత్ర 2‘

ఈ వారం థియేటర్లకు మించిన రీతిలో ఓటీటీలో సినిమాల సందడి కొనసాగుతోంది. మార్చి నెలలో హిట్టైన మూడు సినిమాలు ‘గామి, ఓం భీమ్ బుష్, ప్రేమలు‘ ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు.. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది మరో క్రేజీ మూవీ ‘యాత్ర 2‘. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ల పొలిటికల్ జర్నీ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం రూపొందింది.

మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ‘యాత్ర‘ చిత్రానికి కొనసాగింపుగా ‘యాత్ర 2‘ వచ్చింది. మిగతా ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినా.. వైఎస్సార్ అభిమానులకు, జగన్ అభిమానులకు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్సైన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తోందా? అని ఎదురుచూశారు.

Related Posts