‘పుష్ప 2’ ప్రీ-రిలీజ్ బిజినెస్ షురూ!

కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు.. అంతకు మించిన రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ‘పుష్ప 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ తో టోటల్ ఇండియన్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు రెండో భాగంతో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము దులపడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల బన్నీ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టీజర్ తో ‘పుష్ప.. ది రూల్’పై అంచనాలు మరెన్నో రెట్లు పెరిగాయి.

ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతోన్న ‘పుష్ప 2’కి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ షురూ అయ్యింది. ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను రూ.200 కోట్లకు దక్కించుకున్నాడట ఎ.ఎ. ఫిల్మ్స్ అధినేత, పాపులర్ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని. అలాగే.. అన్ని భాషలకు సంబంధించి ‘పుష్ప 2’ డిజిటల్ రైట్స్ రూ.250 నుంచి రూ.300 కోట్లు పలుకుతున్నాయనే ప్రచారం.

Related Posts