అశోకుడు కాలం నాటి కథతో ‘మిరాయ్’

‘హనుమాన్’ మూవీతో నయా స్టార్ గా అవతరించాడు యంగ్ హీరో తేజ సజ్జ. పాన్ ఇండియా లెవెల్ లో ‘హనుమాన్’ అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఇప్పుడు తన తర్వాతి సినిమాలను సైతం ‘హనుమాన్’కి ఏమాత్రం తగ్గని రీతిలో ఎంపిక చేసుకుంటున్నాడు. ఈకోవలోనే చేస్తున్న చిత్రం ‘మిరాయ్’. ఒకవిధంగా ‘హనుమాన్’ విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిందట.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు.. ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. అశోకుడు కాలం నాటితో కథతో సాగే ఈ స్టోరీకి సంబంధించిన గ్లింప్స్ అయితే బాగా ఆకట్టుకుంటుంది.

‘సామ్రాట్ అశోక్..చరిత్రలో మరకగా మిగిలిన అతడి కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపం నుంచి వెలుగు చూసిన ఓ దేవ రహస్యం.. అదే మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం.. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామకం.. అలాంటి జ్ఞానానికి చేరువ అవుతోన్న ఓ గ్రహణం.. ఆ గ్రహణాన్ని కాపాడే ఓ జననం..ఇది తరాలుగా తగ్గని మహారణం’ అంటూ ఓ మాంక్ చెప్పిన డైలాగ్ తో హీరో తేజ సజ్జా ఎంట్రీ బాగుంది. ఈ గ్లింప్స్ కోసం 20 రోజుల పాటు చిత్రీకరించారట. పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లోని విజువల్స్ తో కొన్ని వార్ ఎపిసోడ్స్ తోనూ ఈ గ్లింప్స్ అదిరిపోయిందని చెప్పొచ్చు.

తేజ సజ్జాకి జోడీగా రితిక నాయర్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా ఓ హీరో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే.. ఈ మూవీలో విలన్ రోల్ పై క్లారిటీ రానుందట. ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మిరాయ్’ – ది సూపర్ యోధ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి మరిన్ని డిటెయిల్స్ త్వరలోనే రివీల్ చేస్తారట.

Related Posts