క్రేజీ ఆఫర్ కొట్టేసిన ‘ప్రేమలు’ బ్యూటీ?

ఒక్క సినిమా హిట్టైందంటే చాలు ఆ హీరోయిన్స్ ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోతుంటారు. ‘ఉప్పెన’తో కృతి శెట్టి, ‘పెళ్లి సందడి’తో శ్రీలీల వంటి వారు ఈ కోవలోకే వస్తారు. ఇప్పుడు ఈ లిస్టులో ‘ప్రేమలు’ భామ మమిత బైజు కూడా చేరబోతుంది. మలయాళంలో ఘన విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’.. తెలుగులోనూ అనువాద రూపంలో అదరగొట్టింది.

ఈ సినిమా చూస్తుంన్నంత సేపు మమిత అచ్చమైన తెలుగమ్మాయిలాగే కనిపించింది. ఆమె క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, బబ్లీ నెస్ ఇలా.. ఓ స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మమిత లో పుష్కలంగా కనిపించాయి. ‘ప్రేమలు’ తెలుగులో విడుదలైనప్పుడే అందరూ ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ గా మారిపోతుందనే జోష్యం చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు నిజమయ్యేలా మమిత మంచి ఆఫర్లు అందుకుంటుంది.

విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తొలుత శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ప్లేసును మమిత బైజు తో రీప్లేస్ చేయబోతున్నారట. త్వరలోనే.. విజయ్ మూవీలో మమిత ఎంట్రీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. సితార లోకి ఎంటరైన ఏ హీరోయిన్ అయినా.. ఓ ఐదారు సినిమాలు చేసి కానీ బయటకు రాదు. ఇప్పుడు మమిత కి కూడా సితార లో వరుస ఛాన్సెస్ వస్తాయేమో చూడాలి.

Related Posts