ఎన్టీఆర్.. గాడ్ గిఫ్టెడ్ యాక్టర్.. అతని ప్రేమని తట్టుకోలేం.. కోన వెంకట్

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నటుల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈతరం నటుల్లో అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక.. తారక్ ను తొలి నుంచి పరిశీలిస్తున్న వారిలో రచయిత-నిర్మాత కోన వెంకట్ ఒకరు.

తాజాగా.. తారక్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోన వెంకట్. ‘ఎన్టీఆర్ వెరీ వార్మ్ పర్సన్ అని.. అతను విపరీతంగా ప్రేమిస్తాడని.. తన ప్రేమను తట్టుకోలేము అని’ కోన వెంకట్ ఓ ఇంటర్యూలో తెలిపారు. ‘ఎన్టీఆర్ గ్రోత్, స్ట్రగుల్ ని తాను ‘సాంబ’ నుంచి చూస్తున్నానని.. అతను ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాడు’ అని అన్నారు కోన వెంకట్.

‘మూడు పేజీల సీన్ ఇచ్చినా.. ఒక్కసారి చూసుకుని పట్టేసే ఏకసంథా గ్రాహి ఎన్టీఆర్ అని.. అలాగే ఆ సీన్ లో ఎక్కడా కూడా పాజ్ లను తేడాగా చెప్పడని.. అంతలా ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకుంటాడని.. తారక్ ని పొగడ్తలతో ముంచెత్తాడు కోన. ఇక.. ‘డ్యాన్సులైతే ఎన్టీఆర్ ఇరగదీస్తాడని సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. మిగతా వాళ్లంతా డ్యాన్సులను రిహార్సల్ చేస్తారు. కానీ.. ఎన్టీఆర్ అలా కాదు.. రిహార్సల్ లేకుండానే కేవలం అబ్జర్వ్ చేసి సింగిల్ టేక్ లో ఆ స్టెప్ ను ఓ.కె. చేసేస్తాడని’ కోన వెంకట్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.

Related Posts