రణ్‌వీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ పీరియడ్ మూవీ

ప్రెజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోస్ లో రణ్‌వీర్ సింగ్ ది ప్రత్యేక స్థానం. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల ఫ్లెక్సిబిలిటీ ఉన్న యాక్టర్ రణ్‌వీర్ సింగ్. ఒకవైపు రొమాంటిక్ రోల్స్ లో ఇరగదీస్తూనే.. మరోవైపు యాక్షన్ లోనూ అదరగొడుతుంటాడు. ‘పద్మావత్’ వంటి సినిమాల్లో అయితే రణ్‌వీర్ విలనీకి కూడా కొత్త అర్థం చెప్పాడు. ఇప్పుడు ఆ పాయింట్ నే ప్రశాంత్ వర్మ పట్టుకున్నాడట. ‘పద్మావత్’ మూవీలో రణ్‌వీర్ సింగ్ పోషించిన అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి పాత్ర తరహాలోనే ఓ క్యారెక్టర్ క్రియేట్ చేశాడట.

ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్ తో సాగే ఈ మూవీకి ‘బ్రహ్మరాక్షస్’ అనే టైటిల్ అనుకుంటున్నాడట ప్రశాంత్ వర్మ. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ ను రణ్‌వీర్ సింగ్ కి వినిపించడం.. అతను ఓ.కె. చెప్పడం జరిగిందనేది బీటౌన్ టాక్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుంది. మరో రెండు నెలల్లోనే రణ్‌వీర్ సింగ్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Related Posts