సుధీర్ బాబు తో పోటీకి సిద్ధమైన ఆనంద్ దేవరకొండ

‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. డెబ్యూ మూవీతోనే ఒక మంచి ప్రయత్నం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం’ వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక.. ‘బేబి’ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకుని టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోస్ లో చోటు సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం ఆనంద్ ‘గం గం గణేశా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ శెట్టి దర్శకుడు. ‘గం గం గణేశా’ మూవీ మే 31న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇక.. అదే రోజు ఆడియన్స్ ముందుకు రాబోతుంది సుధీర్ బాబు ‘హరోం హర’. ఈ రెండు యాక్షన్ సినిమాలే. మరి.. ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Related Posts