ముచ్చటగా మూడు మల్టీస్టారర్స్ తో నాగార్జున

కింగ్ నాగార్జున కొత్త రూటులో పయనిస్తున్నాడు. ఒకవిధంగా మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఫాలో అవుతున్నాడు. ఒకవైపు సోలో హీరోగా దుమ్మురేపుతూనే వరుసగా మల్టీస్టారర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ తో కలిసి ‘కుబేర’లో నటిస్తున్నాడు నాగ్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.

ధనుష్ తో ‘కుబేర’ తర్వాత రజనీకాంత్ తోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో నాగార్జున కీ రోల్ లో కనువిందు చేయనున్నాడట. ఈ మూవీలో నాగ్ రోల్ కి మంచి ప్రాధాన్యత ఉండబోతుందట. త్వరలోనే.. రజనీకాంత్ మూవీలో నాగార్జున ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తోనూ మల్టీస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పాతికేళ్ల క్రితమే నాగార్జున-అక్షయ్ కుమార్ కాంబోలో ‘అంగారే’ అనే యాక్షన్ మూవీ వచ్చింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూవీని సెట్ చేశాడట నిర్మాత ఙ్ఞాన్‌వేల్ రాజా. త్వరలోనే.. ఈ మల్టీస్టారర్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.

నాగార్జున సోలో హీరోగానూ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఒకటి ‘నా సామిరంగ’ ఫేమ్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో అయితే.. మరొకటి సుబ్బు అనే నూతన దర్శకుడితో. ఈ రెండు సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా రానున్నాయట.

Related Posts