ప్రభుదేవా ‘ప్రేమికుడు’ రీరిలీజ్‌

దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. అప్పటిదాకా టాప్‌స్టార్స్ ఎన్ని ఇండస్ట్రీ హిట్స్‌ కొట్టినా.. ప్రేమికుడు సినిమా తమిళ్‌ వెర్షన్‌నుంచి డబ్బింగ్ అయి తెలుగునాట కూడా సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. అప్పటిదాకా డాన్స్ కొరియోగ్రాఫర్‌గా , ఇండియన్ మైఖేల్‌ జాక్సన్‌ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా హీరోగా ప్రేమికుడుతో అవతరించాడు. శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ ప్రేమికుడులో చేసిన డాన్సులు నెవర్ బిఫోర్ ఎవర్‌ ఆఫ్టర్‌ అనే చెప్పాలి. అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ వెర్షన్‌కి కన్వర్ట్ చేసి రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ గారు, మురళీధర్ గారు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు నిర్మాతలు.


30 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ప్రభుదేవ ని చూసి స్ప్రింగ్ లు ఏమన్న మింగాడా అనుకునేవాళ్లం. ఒక మంచి ప్రేమ కథ గా సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరితోపాటు ఈ సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను అన్నారు ముప్పలనేని శివ.


30 సంవత్సరాల క్రితం సెన్సేషన్ సృష్టించిన సినిమా మేము రీ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలో ఫ్రీ రిలీజ్డ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఈవెంట్ కి ప్రభుదేవా గారు కూడా హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. రీ రిలీజ్ లో కూడా కలెక్షన్లు సృష్టిస్తుందని ఆశిస్తున్నామన్నారు.ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ గారు, దర్శకుడు ముప్పలనేని శివ గారు, శివనాగు నర్రా గారు, శోభారాణి గారు, నిర్మాతలు రమణ గారు, మురళీధర్ గారు పాల్గొన్నారు

Related Posts