రామ్ చరణ్ చిరు తనయుడుగా.. చిరుతతో ఎంట్రీ ఇచ్చి.. రెండో సినిమాకే ఇండస్ట్రీ హిట్ సాధించారు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను గీతాఆర్ట్స్ నిర్మించింది. ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ ఒకేసారి అందర్నీ రమ్మను అంటూ.. విజిల్స్ వేయించారు. బాక్సాఫీస్ రికార్డ్స్‌లో మెజార్టీ షేర్ తీసుకున్న చిత్రం మగధీర. మెగా బ్లాక్ బస్టర్ “మగధీర” చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది.
ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్న శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు లు