మార్చి 29 న అప్సరరాణి ‘తలకోన’

ఆర్జీవి హీరోయిన్ అప్సరాణి మెయిన్‌లీడ్‌లో నగేష్ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మించిన చిత్రం ‘తలకోన’ . ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు అందులో ఇంకో కోణం కూడా ఉటుందని, అదే విదంగా పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుందన్నారు నిర్మాత శ్రీధర్‌రెడ్డి.


అప్సర రాణీ నటించిన వెరైటీ స్టోరీ ఇది .షూటింగ్ “తలకొనలో అద్భుతంగా జరిగింది. మా సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు దర్శకుడు నగేష్‌ నారదాసి

Related Posts