టాలీవుడ్

టైటిల్ గెస్ చేయమంటోన్న ప్రభాస్

భారీ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్‌ పోయిన తర్వాత ప్రభాస్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ పూర్తయ్యాయి. సాహో నార్త్ లో ఆకట్టుకున్నా.. సౌత్ లో సత్తా చాటలేదు. రాధేశ్యామ్ ఎక్కడా మెప్పించలేదు. ఫ్లాప్ టాక్ తో రాధేశ్యామ్ కథ ముగిసిపోయింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్‌ పోయిందన్న బాధ కంటే.. ఆ నార్త్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పోయేలా చేశారు అనే బాధే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది.

నిజంగా ఈ మూవీ మేకింగ్ చూస్తే ఏదో ప్రభాస్ పై ఓ కుట్ర చేసిన తీసినట్టుగా భావిస్తున్నారు కొంతమంది అభిమానులు. ఇక సినిమా వచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీనికి ముందే ప్రిపేర్ అయి ఉన్న ఫ్యాన్స్ మరీ బాహాటంగా ఫీలవడం లేదు. అయితే వీరి బాధను పోగొట్టేందుకు జూలై నెల రెడీ అవుతోంది.


ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సలార్ మూవీపై మాత్రం ఫ్యాన్స్ తో పాటు బిజినెస్ వర్గాల్లోనూ భారీఅంచనాలున్నాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఓ క్రేజ్ తెచ్చుకుంటుందని నమ్ముతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే బ్లాక్ బస్టర్ కు ఫిక్స్ అయిపోయారు చాలామంది. కేజీఎఫ్ తో ప్రశాంత్ క్రేజ్ కంట్రీ మొత్తం పాకింది.

ప్రభాస్ ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి.. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సలార్ అన్ని బాక్సాఫీస్ లను షేక్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను జూలై 7న విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ తో సినిమా రేంజ్ ను ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేనంతగా పెంచబోతున్నారట. సలార్ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురుచూస్తోన్న తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.


ప్రభాస్ చేస్తోన్న మరో బిగ్ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే టైటిల్ కూడా వచ్చేస్తోంది. ఈ విషయం ప్రభాస్ స్వయంగా ట్వీట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. పైగా ఓ ఫజిల్ కూడా పెట్టాడు డార్లింగ్. కే అనే అక్షరం హైలెట్ అయ్యేలా ఉన్న డిజైన్ చూపిస్తూ.. ఈ మూవీ టైటిల్ ఏంటో గెస్ చేయమని చెప్పాడు.

ప్రస్తుతం ఎవరికి వారు టైటిల్ ను ఊహించే పనిలో ఉన్నారు. మొత్తంగా ప్రభాస్ చేస్తున్నది తెలివైన పనే అనుకోవాలి. ఆదిపురుష్ బాధను మర్చిపోవడానికి ఫ్యాన్స్ కు ఒకే నెలలో రెండు ట్రీట్స్ ఇవ్వబోతున్నాడు. అటు బాలీవుడ్ లో కూడా ఇక ప్రభాస్ ను ఢీ కొట్టడం వారి వల్ల అవుతుందా కాదా అనే విషయంలోఈ రెండు అప్డేట్స్ తో ఓ క్లారిటీ వస్తుంది.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

6 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

8 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

9 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

9 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

10 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

14 hours ago