టైటిల్ గెస్ చేయమంటోన్న ప్రభాస్

భారీ అంచనాలతో వచ్చిన ఆదిపురుష్‌ పోయిన తర్వాత ప్రభాస్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ పూర్తయ్యాయి. సాహో నార్త్ లో ఆకట్టుకున్నా.. సౌత్ లో సత్తా చాటలేదు. రాధేశ్యామ్ ఎక్కడా మెప్పించలేదు. ఫ్లాప్ టాక్ తో రాధేశ్యామ్ కథ ముగిసిపోయింది. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన ఆదిపురుష్‌ పోయిందన్న బాధ కంటే.. ఆ నార్త్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పోయేలా చేశారు అనే బాధే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది.

నిజంగా ఈ మూవీ మేకింగ్ చూస్తే ఏదో ప్రభాస్ పై ఓ కుట్ర చేసిన తీసినట్టుగా భావిస్తున్నారు కొంతమంది అభిమానులు. ఇక సినిమా వచ్చింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీనికి ముందే ప్రిపేర్ అయి ఉన్న ఫ్యాన్స్ మరీ బాహాటంగా ఫీలవడం లేదు. అయితే వీరి బాధను పోగొట్టేందుకు జూలై నెల రెడీ అవుతోంది.


ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సలార్ మూవీపై మాత్రం ఫ్యాన్స్ తో పాటు బిజినెస్ వర్గాల్లోనూ భారీఅంచనాలున్నాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఓ క్రేజ్ తెచ్చుకుంటుందని నమ్ముతున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే బ్లాక్ బస్టర్ కు ఫిక్స్ అయిపోయారు చాలామంది. కేజీఎఫ్ తో ప్రశాంత్ క్రేజ్ కంట్రీ మొత్తం పాకింది.

ప్రభాస్ ఆల్రెడీ ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి.. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సలార్ అన్ని బాక్సాఫీస్ లను షేక్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను జూలై 7న విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ఈ టీజర్ తో సినిమా రేంజ్ ను ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేనంతగా పెంచబోతున్నారట. సలార్ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఎదురుచూస్తోన్న తరుణంలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట