ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్

స్టార్స్ కు, ఫ్యాన్స్ కు మధ్య వారదిగా నిలుస్తోంది సోషల్ మీడియా. తారలు తమ అభిమానులతో నేరుగా ముచ్చటించే అవకాశం కల్పిస్తుంది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండని రెబెల్ స్టార్ ప్రభాస్.. నూతన సంవత్సరం సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు సందేశాన్నందించాడు. ‘నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసేలోగా మీరు న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేస్తూ ఉండండి. ‘సలార్’ ను ఓన్ చేసుకుని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థ్యాంక్స్’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ చేసిన పోస్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లైస్ పంపుతున్నారు.

మంచి విజయం కోసం ఎదురుచూసిన డార్లింగ్ ప్రభాస్ కు సరైన సమయంలో సరైన హిట్ అందించింది ‘సలార్’. గతేడాది డిసెంబర్ 22న రిలీజైన ఈ సినిమా మరే ఇండియన్ మూవీ సాధించనంత హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు రూ.178.7 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లు కలెక్షన్స్ దాటి.. రూ.1000 కోట్లు వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది.

Related Posts