ఏప్రిల్ నుంచి మహేష్-రాజమౌళి మూవీ?

ఒక సినిమాని డైరెక్ట్ చేశామా? వచ్చేశామా అన్నట్టు కాకుండా.. అహర్నిశలు ఆ సినిమా గురించే ఆలోచించి.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ కు దగ్గరచేయడం వరకూ అన్ని బాధ్యతలు తానే తీసుకుంటాడు దర్శకధీరుడు రాజమౌళి. నిర్మాత ఎవరైనా.. తన సినిమాకి సంబంధించి అంతిమ నిర్ణయం మాత్రం రాజమౌళిదే. జక్కన్న పై ఉన్న నమ్మకంతో నిర్మాతలు కూడా సినిమాపై సర్వ నిర్ణయాలు దర్శకధీరుడుపైనే వదిలేస్తుంటారు.

ఒక్కో చిత్రం కోసం సంవత్సరాల తరబడి సమయాన్ని వెచ్చించే రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. గత ఏడాదంతా ఈ సినిమా కథ చర్చలు, లొకేషన్ల రెక్కీలు వంటివి నిర్వహించాడట. ఇక.. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సినిమాని పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ను మూడు దేశాల్లో ప్లాన్ చేశాడట జక్కన్న. అందుకు సంబంధించి ఇప్పటికే ఇప్పటికే పలు లొకేషన్లను ఫైనలైజ్ చేశాడట. ఈనెల నుంచే తన టెక్నీషియన్స్ అందిరతోనూ రెగ్యులర్ గా స్టోరీ డిస్కషన్స్, స్టోరీ బోర్డ్, ప్రీ విజువలైషన్ పనులు మొదలుపెట్టనున్నాడట.

ఇప్పటివరకూ మనం చూడని తరహాలో మహేష్ ను ఈ మూవీలో ఆవిష్కరించనున్నాడట రాజమౌళి. మరోవైపు మహేష్ ‘గుంటూరు కారం’ నుంచి ఫ్రీ అయిపోయాడు. దాంతో ఇప్పుడు తన ఫోకస్ అంతా రాజమౌళి సినిమాపైనే పెట్టాడు. బాడీ మేకోవర్ తో పాటు.. ఈ సినిమాకోసం మార్షల్ ఆర్ట్స్ లోనూ స్పెసల్ ట్రైనింగ్ తీసుకోనున్నాడట. త్వరలో రాజమౌళి సినిమాకి సంబంధించి వర్క్ షాప్స్ లోనూ పాల్గొంటాడట సూపర్ స్టార్.

Related Posts