మారుతి మార్క్ తోనే ప్రభాస్ సినిమా

ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిజీ బిజీగా ఉన్న స్టార్. పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్న యంగ్ రెబెల్ స్టార్.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా ముహూర్తాన్ని పూర్తిచేసుకున్న ఈ మూవీ.. గుట్టు చప్పుడు కాకుండా పూర్తవుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ నుంచి వస్తోన్న ‘సలార్, కల్కి‘ చిత్రాలకు భిన్నంగా మారుతి సినిమా ఉండబోతుందట. మారుతి మార్క్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ పంచనుందట. ఇక.. యంగ్ రెబెల్ స్టార్ నుంచి గత కొన్నేళ్లుగా మిస్సైన ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాలో పుష్కలంగా లభించబోతుందని హామీ ఇస్తున్నాడు మారుతి.

ప్రభాస్ సినిమాకోసం ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ సినిమాకోసం మూడు టైటిల్స్ ఫైనలైజ్ చేశామని.. త్వరలోనే టైటిల్ ను అనౌన్స్ చేస్తామని మారుతి తెలిపాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

డిసెంబర్ లో ‘సలార్‘తో సందడి చేయబోతున్న ప్రభాస్.. వచ్చే యేడాది ప్రథమార్థంలో ‘కల్కి‘ని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నాడు. ఇక వచ్చే సంవత్సరం ప్రథమార్థంలోనే మారుతి చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట.

Related Posts