ఫ్యాన్స్ పై ఫైర్ అయిన జగ్గూభాయ్! కారణం ఏంటి?

జగపతి బాబు.. ఈ పేరు వినగానే ఆయన చేసిన ఎన్నో పాత్రలు కళ్లముందు కదలాడతాయి. అసలు నటుడిగానే పనికిరాడనుకున్న జగపతి ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో పెద్ద ఇమేజ్ తెచ్చుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డులు అందుకుని విమర్శకుల నోళ్లుమూయించాడు. ‘లెజెండ్‘ చిత్రం నుంచి విలన్ గా మారిన జగపతిబాబు.. ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్ గా బిజీగా కొనసాగుతున్నాడు.

రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మ్యాన్లీ హీరో అనిపించుకున్నాడు జగపతి బాబు. ఇక ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జగ్గూభాయ్ స్టైల్. అది తనను అభిమానించే అభిమానుల విషయంలోనైనా. లేటెస్ట్ గా అదే జరిగింది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న జగపతిబాబు హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. జగపతిబాబుకి ఎన్నో అభిమాన సంఘాలున్నాయి. అయితే.. అవే అభిమాన సంఘాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని.. ఇకపై అలాంటి సంఘాలకు తాను దూరంగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు జగపతిబాబు.


ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. ‘అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్య కారణంగా భావించాను. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని, వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి.. వాళ్లు నాకు తోడుగా ఉంటే.. నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు.

మనసు ఒప్పుకోకపోయినా.. బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి, జీవించనివ్వండి’’ అంటూ ఫ్యాన్స్ కి తన సందేశాన్నందించాడు జగ్గూభాయ్. ప్రస్తుతం జగపతిబాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే జగపతిని అభిమానుల విషయంలో అంతగా బాధించిన అంశాలు ఏమిటని ఆరాతీస్తున్నారు నెటిజన్స్.

Related Posts