ఏఐ మాయ.. ఎన్టీఆర్ అదుర్స్

ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఫ్యూచర్ ని మొత్తం శాసించే టెక్నాలజీ. ఏఐ ఇప్పుడు సినిమా రంగానికి కూడా పాకింది. మన స్టార్స్ ఇలా ఉంటే బాగుంటుంది. అలా ఉంటుంది బాగుంటుంది అనే ఊహలకు ప్రతిరూపంగా ఏఐ టెక్నాలజీతో తమ అభిమాన కథానాయకులను తీర్చిదిద్దుతున్నారు ఫ్యాన్స్. అలాంటివే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోస్ కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఎన్టీఆర్ ఏఐ ఫోటోలలో ఎక్కువగా ‘దేవర‘ సినిమాని బేస్ చేసుకుని రూపొందినవి ఉన్నాయి. ఆద్యంతం సముద్రం నేపథ్యంలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మత్స్యకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున పడవల దగ్గర పీరియాడిక్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న ఏఐ ఫోటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఎన్టీఆర్ స్టైలిష్ మేకోవర్ అదుర్స్ అనిపించేలా ఉంది.

ఒక ఏఐ ఫోటోలో కత్తి పట్టుకుని ఉంగరాల జుట్టుతో కదణ రంగంలోకి దూకుతున్న పెద్ద పులిలా ఎన్టీఆర్ లుక్ అదరహో అనిపిస్తుంది.

మరొక ఏఐ ఫోటోలో ఎయిట్ ప్యాక్ లుక్ లో స్టైలిష్ గా కళ్లజోడు పెట్టుకుని.. పులితో సయ్యాటలు ఆడుతున్న ఎన్టీఆర్ ఫోటో కూడా ఆకట్టుకుంటుంది.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు సముద్రపు ఒడ్డున ఆక్వామాన్ లుక్ లో బేర్ బాడీతో దర్శనమిస్తున్న ఎన్టీఆర్ మరో ఏఐ ఫోటో మనల్ని అస్సలు కళ్లు తిప్పుకోనీకుండా చేస్తుంది.

Related Posts